Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీ నాయకత్వం.. తక్షణ ప్రయోజనాల కోసం కాదు.. భవిష్యత్ కోసం!
posted on: Apr 20, 2026 1:02PM

సాధారణంగా భారత రాజకీయాలలో నేతలు తక్షణ ఫలితాలే పరమావధిగా పని చేస్తుంటారు. ఈ రోజు వార్తల్లో ఎలా కనిపించాలి. ఎన్నికలలో ఎలా లాభపడాలి, ప్రత్యర్థిపై పై చేయి ఎలా సాధించాలి అన్న దానిపైనే ఆలోచిస్తుంటారు. ఆ తక్షణ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతుంటారు. అయితే ప్రధాని మోడీ అలా కాదంటారు విశ్లేషకులు. మోడీ రాజకీయాలు ఐదు రోజుల కోసమే, తక్షణ ప్రయోజనాల కోసమో కాదు.. రాబోయే ఐదు దశాబ్దాల కోసమని అంటారు. అంటే దేశ భవిష్యత్, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, జియోపాలిటికల్ ప్లేస్, గ్లోబల్ ఎఫెక్ట్..వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మోడీ అడుగులు వేస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు.
ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి. ప్రాక్టివ్ లీడర్షిప్.. దేశానికి అవసరమైన సంస్కరణలను ముందే ప్రారంభించడం. రియాక్టవ్ అవగాహన.. ప్రత్యర్థులు ఏ దిశగా కదులుతున్నారో అర్ధం చేసుకుని.. అదే దిశలో ముందుగానే కౌంటర్ స్ట్రాటజీ అంటే ప్రతి వ్యూహం సిద్ధం చేయడం.
ప్రపంచ సంక్షోభాల్లో మోదీ నాయకత్వం
గత దశాబ్దంలో భారత్ ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటంటే.. కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక మాంద్యం, చైనా, అమెరికా ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో అస్ధిరత. వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబడటంలో మోడీ నాయకత్వమే కీలకమని పరిశలకులు విశ్లేషిస్తున్నారు.
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్నది. విదేశీ పెట్టుబడుల్లో గణనీయ పురోగతి, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, మౌలిక సదుపాయాల విస్తరణ. బలోపేతమౌతున్న మాన్యు ఫ్యాక్చరింగ్ రంగం. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక దృష్టితో మోడీ తీసుకున్ననిర్ణయాల ఫలితమేనని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక మోడీ వ్యతిరేకులు తరచూ.. ఆర్థిక వ్యవస్థపై, విదేశాంగ విధానంపై, అంతర్గత రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. అదే సమయంలో మోడీ అనుకూలురు మాత్రం విమర్శకులు తాత్కాలిక సమస్యలపై దృష్టి పెడతారనీ, మోదీ మాత్రం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడతారనీ సమర్ధిస్తారు.
అంటే.. విమర్శలు తక్షణ ప్రతిస్పందన, మోడీ నిర్ణయాలు, విధానాలూ భవిష్యత్ నిర్మాణం కోసం అంటుంటారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం మోడీ మరో నాలుగైదేళ్ల పాలన భారత్ ను సురక్షితమైన, ఆర్థికంగా బలమైన, జియోపాలిటికల్గా ప్రభావవంతమైన, ప్రపంచంలో తిరుగులేని స్థానంలో నిలబెట్టే అవకాశం ఉంది. అంటే.. మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురు దిశగా పయనిస్తోంది. మోదీ నాయకత్వం తక్షణ రాజకీయాలకంటే పెద్ద కథ. మోదీ నాయకత్వాన్ని అనుకూలంగా చూసే వర్గం ఆయనను దూరదృష్టి ఉన్న నాయకుడిగా చూస్తుంటే.. అయన విమర్శకులు మాత్రం తక్షణ రాజకీ యాల నాయకుడిగా చూస్తారు. కానీ మోడీ మద్దతుదారుల దృష్టిలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం భారత భవిష్యత్తు కోసం వేసిన పునాది.అందుకే వారు మోడీని అంచనా వేయడం సులభం కాదు.. ఆయన రాజకీయాలు ఈ రోజు కోసం కాదు.. రాబోయే దశాబ్దాల కోసమని చెబుతారు.
సంకలనం, సేకరణ : సీతారాం కంఠమనేని






