సిక్కింలో రూ. నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

posted on: Apr 28, 2026 1:09PM

సిక్కింరాష్ట్రం భారత యూనియన్‌లో చేరి అర్ధసంవత్సరం పూర్తి చేసుకున్న వేళ, ఆ రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సిక్కిం గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  4,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన  భారీ బహిరంగ సభలో ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

వీటిలో  రవాణా, విద్యుత్ ,  పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం   ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సిక్కిం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానత మరింత బలోపేతం కానుంది.

ఈ సందర్భంగా పర్యావరణహిత అభివృద్ధికి సిక్కింను రోల్ మోడల్ గా అభివర్ణించారు.  సేంద్రీయ వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రశంసించారు. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయనీ..  స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని మోడీ చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే సంప్రదాయాలను కాపాడుకోవడంలో సిక్కిం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  యాక్ట్ ఈస్ట్  విధానంలో సిక్కిం కీలక పాత్ర పోషిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు,  హైవేల నిర్మాణం శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ప్రాజెక్టులతో రాబోయే రోజుల్లో సిక్కిం కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా, పరిశ్రామిక,  విద్యా హబ్‌గా ఎదిగే అవకాశం ఉందంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...