Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి 14 రోజుల రిమాండ్
posted on: Apr 25, 2026 3:59PM

డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో కీలక సాక్షులను డబ్బులతో ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, అలాగే బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అనంతబాబును శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను న్యాయప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలుగా భావించి, రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, తాజా పరిణామాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సాక్షుల భద్రత, న్యాయవ్యవస్థ స్వతంత్రత వంటి అంశాలపై చర్చలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇకపై ఈ కేసులో దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, మరిన్ని వివరాలు బయటకు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.


.webp)



