అజ్ణాతంలోకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు?

posted on: Feb 20, 2026 2:13PM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ణాతంలోకి వెళ్లారా? ఎవరికీ ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా, తన గన్ మెన్ లను సైతం వదిలేసి అజ్ణాతంలోకి వెళ్లారా అంటే ఔననే సమాధానమే వస్తున్నది. డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు శుక్రవారం (ఫిబ్రవరి 20) శాసనమండలి సమావేశం నుంచి అర్ధంతరంగా ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా అర్ధంతరంగా వెళ్లిపోయారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్య  లక్ష్మీదుర్గకు ప్రమేయం ఉందని సిట్ నిర్ధారించింది.

 ఆమె హత్యకు ప్రేరేపించడమే కాకుండా, నేరంలో భర్తకు సహకరించినట్లు దర్యాప్తులో తేలిన నేపథ్యంలో దీంతో ఆమె అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు.  ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు కూడా  తన గన్‌మెన్లు,  వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి ఒక్కడే మండలి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోవడంతో ఆయన కూడా అజ్ణాతంలోకి వెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో పోలీసుల జాప్యంపై శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనంతబాబు ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ణాతంలోకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...