పోలీసుల త్యాగాల స్ఫూర్తిగా రక్తదాన శిబిరం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
posted on Oct 26, 2025 1:39PM

సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని శాంతి భద్రతల రక్షణలో అశువులు బాసిన పోలీసుల త్యాగాలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు. రక్తదానం చేసేందుకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుకు వచ్చిన యువతను ఆమె అభినందించారు. పోలీసు అమర వీరుల సంస్మరణార్ధం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాత ఒక ప్రాణదాతగా ఆమె అభివర్ణించారు. రక్తదానం అనేది యాక్సిడెంట్, ప్రసూతి లాంటి సందర్భాలలో ఎక్కడో ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో వున్న వ్యక్తికి ప్రాణం పొసే మహత్తర కార్యమన్నారు. సేవా భావంతో రక్తదానం చేస్తున్న రక్తదాతలు మరెందరికో ప్రేరణ కావాలని ప్రశాంతి రెడ్డి ఆకాంశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు రూమర్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డి పాళెం సర్కిల్ సి ఐ లు సుధాకర్ రెడ్డి, సురేంద్రబాబు, శ్రీనివాసులు రెడ్డితో పాటు కోవూరు నియోజకవర్గ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియి పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, కోవూరు మండల టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.