Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేవినేని ఉమాతో విభేదాలున్నాయా?.. ఎమ్మెల్యే వసంత కృష్ణ క్లారిటీ..!
posted on: Jul 31, 2026 8:21PM

మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్థానిక సమస్యల పరిష్కారం నుంచి సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి పనిచేసే అంశం వరకు పలు విషయాలపై స్పందించారు. స్థానిక లారీ యజమానుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు వారి తరఫున తాను చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రిఫెక్స్ సంస్థ ప్రతినిధులు, లారీ అసోసియేషన్‌ల మధ్య అవగాహన కుదిరేలా కృషి చేశామని చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 12 నుంచి 15 లారీల ఫ్లై యాష్‌ను స్థానికులకు ఉచితంగా కేటాయించేలా, అదనంగా అవసరమైతే నిర్ణీత రుసుము చెల్లించి తీసుకెళ్లేలా పరిష్కారం లభించిందని వివరించారు.పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఎమ్మెల్యే స్పందించారు.
సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి మహానాడు నిర్వహణలో పార్టీ ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించానని, తాను జూనియర్ నాయకుడిగా తన బాధ్యతల మేరకే పనిచేస్తానని చెప్పారు.గత ఎన్నికల్లో 43 వేల ఓట్ల భారీ మెజారిటీ టీడీపీ కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పార్టీల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో చర్చలకే ప్రాధాన్యం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.
MLA Vasantha Venkata Krishna Prasadm, Mylavaram MLA, VTPS Fly Ash Issue,
Fly Ash Controversy, Refex Company, Lorry Owners Protest,Tender Dispute


.webp)
.webp)


