రోజాకి జగన్ సారీ... ఇప్పటికైనా అర్ధమయిందా..!
posted on: Feb 6, 2018 10:51AM
.jpg)
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అయినా నగరి ఎమ్మెల్యే రోజాకు సారీ చెప్పారట. జగన్ ఏంటీ.. రోజాకి సారీ చెప్పడం ఏంటీ..? అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. వైసీపీ పార్టీలో కాస్త యాక్టివ్ గా ఉండేవాళ్లలో రోజా కూడా ఒకరు అని చెప్పొచ్చు. టీడీపీ పై విమర్శలు గుప్పించాలన్నా.. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబునాయుడి పై విమర్శలు చేయాలన్నా జగన్ తరువాత స్థానం రోజాకే దక్కుతుంది. అంతలా విరుచుకుపడుతుంది రోజా. మైకు దొరికితే చాలు పూనకం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలయకుండా.. కాస్త కూడా నోరు కంట్రోల్ లో లేకుండా మాట్లాడుతుంటారు రోజాగారు. ఇప్పుడు ఆ తొందరపాటే ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతుంది.
గతంలో ఆమె వల్లే నంద్యాల ఉపఎన్నికల్లో ఓడిపోయామని సొంత పార్టీ నేతలే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తన నోటి దూల వల్ల నియోజక వర్గ ప్రజల్లో కూడా ఆమెపై వ్యతిరేక భావన ఏర్పడింది. ఈ విషయాన్నే ఆ పార్టీ ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్ కు చెప్పారట. దీంతో... రాబోయే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేది లేదని రోజాకి తేల్చి చెప్పారట జగన్. 'అమ్మా...! ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందని 'పికె' సర్వేలో తేలింది...! అక్కడ మీరు ఓడిపోవడం ఖాయం...మీకు ఈసారి టిక్కెట్ ఇవ్వలేను..అని ఆయన 'రోజా'ను పిలిపించుకుని చెప్పారట. దీంతో...'రోజా' నివ్వెరపోయిందట. పార్టీ కోసం తానెంత కష్టపడింది వివరించినా..'జగన్' పట్టించుకోకుండా...'తానేం చేయలేనని..సారీ..'అన్నాడట. దానిపై 'రోజా' తన వాదనను వినిపిస్తూ...'పికె' సర్వే చేసి ఇస్తే...సీనియర్ అయిన తనకు 'టిక్కెట్' ఇవ్వకుండా వేరే ఎవరికో..ఇవ్వడం ఏమిటని మండిపడ్డారట. దీనిపై 'జగన్' మళ్లీ కలుగ చేసుకుంటూ...'అమ్మా..మీరు పార్టీ కోసం..ఎంత కష్టపడిందీ నాకు తెలుసు..! మీ కష్టాన్ని మర్చిపోను..రాబోయే ఎన్నికల్లో మనకు ప్రతి సీటు..గెలవాలి..కానీ..'నగరి'లో మీపై వ్యతిరేకత ఉంది...ఇక్కడ మీకు సీటు ఇస్తే పార్టీ ఖాయంగా ఓడిపోతుంది. మీరు చేసిన కష్టానికి మీకు ఎమ్మెల్సీ ఇస్తాను..సర్దుకుపోండి..పార్టీ అధికారంలోకి రావడంతోనే అందరికీ న్యాయం చేస్తాను...అని ముగించారట. దీంతో..ఎమ్మెల్యే 'రోజా' ఖంగుతిన్నారట. ఇప్పుడీ విషయం పార్టీలో సంచలనం సృష్టిస్తోంది.
రెంటికి చెడ్డ రేవడిలా..జగన్ ఇస్తున్న షాకులకు తట్టుకోలేక..పోనీ టీడీపీలోకి వెళదామంటే...టీడీపీపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమెకు నో ఎంట్రీ...పోనీ జనసేన వైపు చూద్దామన్నా... ఇంకా పూర్తిస్థాయి నిర్మాణం కూడా కానీ పార్టీ అని కూడా చూడకుండా పవన్ పై కూడా ఆమె చాలా దారుణంగా విమర్శలు గుప్పించారు. అక్కడ కూడా ఆమెకు నో ఎంట్రీ.. మరి పాపం రోజాకు రాజకీయాల్లో శాశ్వత శత్రువులను ఏర్పరుచుకోకూడదన్న విషయం ఇప్పటికైనా అర్దమైఉండొచ్చు. ఎంత కోపం ఉన్నా.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రాజకీయ నాయకులు ఆచితూచి ఎందుకు మాట్లాడుతారో ఇప్పుడు తెలిసుంటది. ఏది ఏమైనా..పార్టీ కోసం, నమ్మిన నాయకుని కోసం కష్టపడిన 'రోజా'కు ఇటువంటి పరిస్థితి రావడం బాధాకరమైన విషయమే..






.webp)



