Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంతైనా చంద్రబాబు గ్రేటే...
posted on: Dec 16, 2017 10:05AM

వైసీపీ పార్టీలో అందరి సంగతేమో కానీ... ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి...ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... ఎప్పుడు చంద్రబాబుపై విరుచుకుపడదామా అని చూస్తుంటారు. ఇద్దరూ పోటీ పడి మరీ చంద్రబాబును ఏకి పారేస్తారు. అలాంటి వారి నోట చంద్రబాబును పొగడాలంటే .. మామూలు విషయం కాదు. కానీ అలాంటిదే జరిగింది. ఏ నోటితో అయితే చంద్రబాబుపై దుమ్మెత్తి పోసిందో.. అదే నోటితో రోజా చంద్రబాబును గ్రేట్ అని అన్నదట. షాకింగ్ గా ఉంది కదా... అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే.
ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో పోలవరం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ టూర్ లో భాగంగా.. పోలవరం సందర్శించారు. అంతేకాదు... పోలవరం పై శ్వేత పత్రం కూడా విడుదుల చేయమని ప్రభుత్వాన్ని కోరారు. ఇక వైసీపీ విషయానికొస్తే.. పోలవరంపై ఎప్పటినుండో ఏపీ ప్రభుత్వంపై....చంద్రబాబుపై అయినదానికి, కానిదానికి పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది లేండి.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎక్కడ ఆ క్రెడిట్ చంద్రబాబుకు వెళ్లిపోతుందో ? మరో ఐదేళ్ల పాటు తాము అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందో ? అన్న టెన్షన్ వాళ్లది. ఈ నేపథ్యంలోనే పోలవరంలో అసలు పనులు ఎక్కడి వరకూ వచ్చాయి...అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కట్టగట్టుకొని ఎమ్మెల్యేలు అందరూ వెళ్లారు. ఇంకేముంది.. అక్కడ జరుగుతున్న పనులను చూసి ముక్కున వేలువేసుకోవాల్సి వచ్చిందట. అక్కడ పనులు చూసిన వైసీపీ నాయకులు షాక్ అయ్యారట. ఇప్పటివరకు పోలవరం పనులు జరగడం లేదని చెప్పిన వైసీపీ నాయకులే, గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడానికి ఇంకా 26 నెలలు పడుతుందని అంచనాకు వచ్చారట. ఈ విషయాన్ని సదరు వైసీపీ టీం మొత్తం మీడియా ముందే చెప్పారట. ఎన్నికలకు మరో యేడాదిన్నర టైం ఉండడంతో అప్పటి వరకు చాలా వరకు పని పూర్తయిపోతుందని వాళ్లే ఓ అంచనాకు వచ్చారట. ఇదంతా మీడియా సమక్షంలోనే వాళ్లలో వాళ్లే చర్చించుకున్నారట. ట్విస్ట్ ఏంటంటే.. అక్కడ పనులు చూసి రోజా నోటి నుండి ఒక్కమాట కూడా రాలేదట. అంతేకాదు పక్కన ఉన్నవాళ్లతో... పోలవరం ప్రాజెక్టు పనులు ఇంత స్పీడ్‌గా జరుగుతున్నాయని తాను అనుకోలేదని అన్నారట. మొత్తానికి రోజా కూడా బాబు గొప్పతనాన్ని గుర్తించింది. రోజా కూడా పోలవరం ప్రాజెక్టు పురోగతి చూసిన తరువాత ఏం మాట్లాడలేదు అంటే.. మరి వారే ప్రాజెక్టు పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయని ఒప్పుకున్నట్టే కదా..






