Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోజక్కా ఈ పాదయాత్రలు అవసరమా...!
posted on: Nov 27, 2017 4:29PM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏదో పాపం కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకపోయినా.. వారంలో ఒకరోజు హైదరాబాద్ వచ్చి కోర్టుకు హాజరై.. మళ్లీ పాదయాత్ర ఎక్కడ ఆపామో.. అక్కడికి వెళ్లి.. మళ్లీ పాదయాత్ర మొదలు పెడుతూ నానా కష్టాలు పడుతున్నాడు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న మహానుభావుడు. మళ్లీ దానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిరసన అని పేరు ఒకటి. ఇక పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్యారడైజ్ పేపర్ల గొడవ.. రెండు రోజే నడుముకి బెల్ట్..ఇక ఇప్పుడు తాజాగా ఈడీ షాక్.. ఇవన్నీ కావనట్టు పార్టీ నేతల జంపింగ్లు. ఇన్ని తలకాయనొప్పులు ఉన్నా.. ఏదో నవ్వుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. దీనివల్ల జగన్ కు ఒరిగేది ఏముందో తెలియదు కానీ..పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు.
ఇక్కడి వరకూ బాగానే అసలు జగన్ పాదయాత్రే చాలా కష్టంగా జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా కూడా పాదయాత్ర చేస్తా అని ముందుకు వస్తుంది. ఈ నెల 28వ తేదీ నుంచి రోజా పాదయాత్ర ప్రారంభం కానుంది. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనకు గాను ఆమె ఈ పాదయాత్ర చేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. నగరి నుండి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు.. రోజా పాదయాత్ర నిర్వహించనున్నారుట. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు జరుగుతుందట. మరి ఇప్పటికే తన నోటి దూల వల్ల జగన్ కు సమస్యలు తెచ్చిపెట్టిన రోజా.. పాదయాత్ర అంటూ బయలుదేరింది. ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల ఏం సమస్యలు తెచ్చిపెడుతుంటే. మరి ఎన్ని పాదయాత్రలు చేస్తే ఏం లాభం.. నోరు కంట్రోల్ లో లేకపోతే.. ఈ విషయం అటు జగన్.. ఆయన చెల్లిగా చెప్పుకునే రోజా ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో..


.jpg)



