ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మిస్‌ఫైరింగ్ మిస్టరీ!

posted on: Feb 17, 2016 8:31AM

 

నిన్న హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన మిస్‌ఫైరింగ్‌ మిస్టరీ ఇక వీడేటట్లు లేదు. పోలీసుకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అక్బర్‌కి గన్నులంటే మహా ముచ్చట. దానికి తోడు అతని పక్కనే ఉండే ఎమ్మెల్యే గనమెన్‌ చేతిలో ఎప్పుడూ తుపాకీ ఉండటంతో నిన్న దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించడం మొదలుపెట్టాడు. అది కాస్తా లోడ్‌ చేసి ఉండటంతో, మిస్‌ఫైర్‌ అయ్యింది. నేరుగా డ్రైవర్‌ గుండెల్లోకి దూసుకుపోయింది. కానీ ఈ సంఘటన గురించి చదువుతుంటే ఎవరికైనా కావల్సినన్ని అనుమానాలు కలుగక మానవు.

 

- అత్యవసర పరిస్థితుల్లో తప్ప లోడ్‌ చేసి ఉంచని తుపాకీని నిండుగా లోడ్‌ చేసి ఎందుకు ఉంచినట్లు.

 

- నిరంతరం సేఫ్టీలాక్‌లో ఉండాల్సిన గన్‌, ఫైరింగ్‌కి అనుకూలంగా ఎందుకు మారిపోయింది.

 

- లక్షల ఖరీదు చేసే ఆయుధాన్ని, అందులోనూ లోడ్ చేసి ప్రమాదకరంగా ఉన్నదాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వదిలి వెళ్లినట్లు.

 

- గన్‌మేన్‌ రవీందర్‌కీ, డ్రైవరు అక్బరుకీ మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఉన్నాయని వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత!

 

- అనుకోకుండా తుపాకీని పేలిస్తే అది ఎదురుగా ఉన్నవారికి తగలాలి కానీ, తుపాకీని పట్టుకున్న వ్యక్తి గుండెల్లోకి దూసుకుపోవడం ఏంటి!

 

ప్రస్తుతం కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండటంతో నిజానిజాలు ఏమిటో త్వరలోనే వెల్లడి కావచ్చు. అంతవరకూ ఈ మిస్‌ఫైరింగ్‌ మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది!

google-ad-img
    Related Sigment News
    • Loading...