టెన్త్ టాపర్లకు ఎమ్మెల్యే బొజ్జల కానుక

posted on: May 2, 2026 1:03PM

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చదువులో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చారు.  ద్యలో మెరుగైన ప్రతిభ కనబరిచిన టెన్త్ టాపర్లకు ఆయన  జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ప్రకటించారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు  ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా పెద్ద లక్ష్యాలు సాధించొచ్చని పిల్లలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  కుంటిపూడికి చెందిన జస్మిత – 598 మార్కులు, శ్రీకాళహస్తి కి చెందిన సాయి పూజిత – 594 మార్కులు, .తొండమనాడుకి చెందిన మోహిత్ చరణ్ 591 మార్కులు సాధించారు. ఈ ముగ్గురికీ ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి  ఈ నజరానా అందించనున్నట్లుగా ఎమ్మెల్యే ప్రకటించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...