ట్రాఫిక్ బూత్ లలో మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్

posted on: Apr 30, 2026 2:01PM

ఎండల వేడిమి తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించేటప్పుడు ఉపశమానం పొందేందుకు  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని  ట్రాఫిక్ బూత్ లలో మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గురువారం (ఏప్రిల్ 30) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూలింగ్ గ్లాసెస్ ను పంపిణీ చేశారు.  

ట్రాఫిక్ బూత్ లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు  ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనం  పొందేందుకు జిల్లా ఎస్పీ చోరవతో    చల్లటి నీటి తుంపరలను  చల్లే ఫ్యాన్ లు (మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్)  ఏర్పాటు చేశారు. ఈ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్  ఎండ వేడిమి తగ్గించడానికి నీరు జల్లుతూ చల్లదనాన్ని పంచుతాయి. ఈ ఏర్పాట్లతో ఎర్రటి ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చల్లటి గాలిని అందించి వేడి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో డిస్పీ తిరుపతిరావు, టౌన్ సి.ఐ  మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్.ఐ  అరుణ్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...