Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉక్రెయిన్ లో పౌర నౌకపై క్షిపణి దాడి.. నలుగురు ఇండియన్స్ సహా పలువురు మృతి.!
posted on: Jul 21, 2026 7:53AM

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం సమీపంలో నల్ల సముద్ర జలాల్లో ధాన్యపు నిల్వలతో ప్రయాణిస్తున్న ఒక పౌర, వాణిజ్య కార్గో నౌకపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారత నావికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఇండియన్ తీవ్రంగా గాయపడ్డారు. పౌర రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఘాతకం వెనుక రష్యా బలగాల ప్రమేయం ఉందంటూ ఉక్రెయిన్ ఆరోపించింది.
టర్కీకి చెందిన షిప్పింగ్ సంస్థ నిర్వహణలోని గోల్డెన్ లియో అనే బల్క్ క్యారియర్ నౌక, గినియా, బిస్సావ్ దేశ పతాకంతో సముద్రంలో ప్రయాణిస్తోంది. జూలై 19 న ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక ఒడెస్సా పోర్టు నుండి భారీగా ఆహార ధాన్యాల లోడుతో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక క్షిపణి దాడికి ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకన్న వెంటనే స్థానిక సహాయక బృందాలు, తీర రక్షణ బలగాలు రెస్క్యూ చర్యలు చేపట్టాయి. అయితే, దెబ్బతిన్న నౌక భాగాల మధ్య చిక్కుకుని నలుగురు ఇండియన్స్ తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన లోకల్ నెవిగేషన్ పైలట్, మరికొందరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిని ఒడెస్సాలోని క ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఉ మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియపై దృష్టి సారించినట్లు పేర్కొంది.
పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది. ఇటువంటి దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంటూ.. మృతి చెందిన నావికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
Russia Ukraine war, Golden Leo vessel, Indian sailors death , missile attack on Odesa port


.webp)



