శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

posted on: May 4, 2026 4:56PM

 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి కేరళలోని  కన్నూర్ కు బయలుదేరిన  ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 6E 7225 ఇండిగో విమానం బయలుదేరి సుమారు అరగంట గాల్లో ప్రయా ణిస్తున్న సమయంలో సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు.

తర్వాత అత్యంత జాగ్రత్తలతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 76 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యపై విమాన సాంకేతిక బృందం పరిశీలన ప్రారంభించగా, ప్రయాణి కులను ఇతర ఏర్పాట్ల ద్వారా గమ్యస్థానానికి పంపే చర్యలు చేపట్టారు.ఈ ఘటనతో కొంతసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన నెలకొన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...