Latest News
అనన్య రిసార్ట్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి సురేఖ
posted on: Mar 9, 2026 5:24PM
.webp)
వనస్థలిపురంలోని హరిత వనస్థలి పార్క్‌లో ఉన్న అనన్య రిసార్ట్ పై రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండ సురేఖ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిసార్ట్ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన మంత్రి అధికారుల సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా రిసార్ట్‌లోని టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్, కాటేజీలు, కిచెన్ వంటి ప్రాథమిక సదుపాయాలు సరిగా నిర్వహించకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్శకులకు కనీస వసతులు కూడా కల్పించకుండా రిసార్ట్‌ను నిర్లక్ష్యంగా నిర్వహించడం తీవ్రంగా తప్పుబట్టారు. ఈ రిసార్ట్‌ను గత పదేళ్లుగా ఒక ప్రైవేట్ సంస్థ లీజ్‌కు తీసుకుని నిర్వహిస్తోంది.
అయితే ఈ కాలంలో ప్రభుత్వంకు చెల్లించాల్సిన పన్నులు కూడా సరిగా చెల్లించలేదని వెల్లడైంది. పదేళ్ల కాలంలో కేవలం ఒక్క సారి మాత్రమే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించినట్లు అధికా రులు మంత్రికి వివరించారు. అంతేకాకుండా రిసార్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు కూడా అకౌంట్ ద్వారా చెల్లించకుండా నగదుగా ఇస్తున్నట్లు తెలుసుకున్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో రిసార్ట్‌ను ప్రైవేట్ వ్యక్తుల నుండి అటవీశాఖ స్వాధీనం చేసుకుని అభి వృద్ధి పనులు చేపడతామని మంత్రి కొండ సురేఖ తెలిపారు. హరిత వనస్థలి పార్క్‌ను ప్రజలకు మరింత ఆకర్షణీయంగా తీర్చిది ద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఫారెస్ట్ ఉన్నతా ధికారులు, సిబ్బంది ఈ తనిఖీలో మంత్రికి వెంట ఉన్నారు.






