ఉప్పల్ లో తొక్కిసలాట.. మంత్రి శ్రీధర్‌బాబుకు గాయాలు

posted on: Feb 10, 2026 3:34PM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్  ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు గాయపడ్డారు. ఉప్పల్ లోని  ప్రభుత్వ పాఠశాలలో   మంగళవారం (ఫిబ్రవరి 19)   అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమానికి  మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు గాయపడ్డారు.  ఒకింత జాప్యం జరిగినా భద్రతా సిబ్బంది స్పందించి మంత్రిని తొక్కిసలాట బారి నుంచి సురక్షితంగా కాపాడారు. ఈ తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయమైంది. ఈ తొక్కిసలాట ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటా మని పోలీసులు వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...