కూలీగా మారి పార పట్టిన మంత్రి నిమ్మల
posted on Nov 9, 2025 2:31PM
.webp)
ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భవన నిర్మాణ కూలీగా మారి శ్రమదానం చేశారు. పాలకొల్లులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ, శెట్టిబలిజ కల్యాణ మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా మంత్రి నిమ్మల లేబర్ మారి కార్మికులతో కలిసి మంత్రి సైతం కంకర, ఇసుక, సిమెంట్‌ను తట్టల్లో మోసుకెళ్లి మిక్సర్‌లో వేశారు.
మంత్రి తమతో కలిసి పనిచేయడం చూసి కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.1.50 కోట్లతో మొదటి స్లాబ్ నిర్మాణం జరిగిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంట్ పని నోచుకోలేదని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.3 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.