నాలుగు నెలల్లోగా అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. మంత్రి నారాయణ
posted on: Oct 30, 2025 11:28AM
.webp)
రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రైతులకు సంబంధించి ప్లాట్ల కే టాయింపు, రిజిస్ట్రేషన్ల లను నాలుగు నెలలలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందన్న ఆయన వచ్చే నాలుగు నెలల్లో మిగతా వారికి కూడా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. తే సోషల్ మీడియాలో కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారని వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెజిస్ట్రేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ప్రజలను తప్పుదోవపట్టించేలా కొందరు పోస్టులు పెడుతున్నారనీ, వాటిని నమ్మవద్దని అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణంకోసం అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించిన విషయం తెలిపిందే. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా 30,635 మంది రైతుల నుంచి సమీకరించిన 34,911.23 ఎకరాల భూమికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాల్సి ఉన్న సంగతి విదితమే. ఇప్పటివరకూ 29,644 మంది రైతులు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తైందని మంత్రి నారాయణ వివరించారు. మిగిలిన వారికి కూడా నాలుగు నెలలలోపు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.



.webp)


