Latest News

మాట తప్పరు.. మడమ తిప్పరు.. ముస్లిం కుటుంబానికి లోకేష్ రంజాన్ తోఫాగా కొత్త ఇల్లు

posted on: Mar 21, 2026 5:11PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్   విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట ఇస్తే అది నిలబెట్టుకునే వరకూ తాను నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు. ఔను గతంలో అంటే 1995లో అప్పటికి తొలి సారి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబును ఉద్దేశించి ఈ మాటలను అంతా అనే వారు. కాదు కాదు స్వయంగా చంద్రబాబే తన గురించి అప్పట్లో నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను అని అధికారులతో అనే వారు. ఇప్పుడు మంత్రిగా నారా లోకేష్ అచ్చంగా తన తండ్రి బాటలో నడుస్తున్నారా అనిపిస్తున్నది.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆయన   వేగం చూస్తుంటే. తాజాగా ఆయన ఒక ముస్లిం కుటుంబానికి గతంలో ఇచ్చిన మాటను సరిగ్గా రంజాన్ పర్వదినం రోజున నెరవేర్చారు.

విషయం ఏమిటంటే..  సరిగ్గా గత  ఏడాది రంజాన్ పర్వదినం సందర్భంగా ఒక పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన హామీని లోకేష్   ఏడాది తిరిగే లోగా.. మళ్లీ రంజాన్ వచ్చే లోగా నెరవేర్చారు. ఎండా వానా రెండు ఇంట్లోనే అన్నట్లుగా ఒక రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్న  షేక్ అమీర్  కుటుంబానికి పక్కా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు లోకేష్. గత ఏడాది రంజాన్ పర్వదినం సందర్భంగా షేక్ అమీర్ నివాసానికి  నారా లోకేష్ ఆకస్మికంగా వెళ్లారు. ఆ కుటుంబంతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా షేక్ అమీర్ తండ్రి తమ కుటుంబం రేకుల షెడ్డులో ఇబ్బందులను వివరించి తన సొంత ఖర్చుతో కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

షేర్ అమీర్ కుటుంబం మంగళగిరిలోని పోలకంపాడులో వారి పూర్వీకుల కాలంనాటి చిన్న ఇంట్లో నివాసం ఉంటోంది. తమకు ఇల్లు నిర్మించుకునే స్తోమత లేదని అర్ధం చేసుకున్న లోకేష్.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన వారి ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయించారు. మాట ఇచ్చి ఏడాది తిరిగే లోపే తన సొంత ఖర్చుతో, మంచి సౌకర్యాలతో వారికి ఇల్లు నిర్మించారు. సరిగ్గా పవిత్ర రంజాన్ మాసంలోనే వారి చేత ఆ కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయించారు. లోకేష్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి మరీ వారికి రంజాన్ తోఫా అందజేశారు.   లోకేష్ మాటల మనిషి కాదని నియోజకవర్గ ప్రజలు వేనేళ్ల ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...