Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యువతకు ఉద్యోగాలే మా లక్ష్యం...మండలిలో లోకేష్
posted on: Feb 12, 2026 3:43PM

యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏపీకి రాకూడదనే లక్ష్యంతో వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. విశ్వసనీయత ఉన్న ఐదు ప్రముఖ కంపెనీలకే రూ.99 పైసలకు భూములు కేటాయించామని, వాటి ద్వారా 65 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.
పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి లోకేష్ ధీటుగా సమాధానం ఇచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్, మదర్సన్, రహేజా, ఏఎన్ఎస్ఆర్ సంస్థలకు మాత్రమే భూములు ఇచ్చామని, వాటిలో పారదర్శకత ఉందని వివరించారు.
భూముల కేటాయింపుల్లో ఎక్కడా లంచాలు తీసుకునే అవసరం తమకు లేదని, ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. “నన్ను విమర్శించాలంటే కప్ టీ గురించి విమర్శించండి. ఒక కప్పు కాఫీ కంటే ఎక్కువ తీసుకున్నానని నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధం” అని వ్యాఖ్యానించారు.
విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. 2029 నాటికి విశాఖలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ టార్గెట్ అని లోకేష్ తెలిపారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేయడం సరికాదని మంత్రి మండిపడ్డారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని, ఆదాయం కంటే ఉద్యోగాలే ముఖ్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


.webp)



