Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంగళగిరిలో శ్రీ సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేష్
posted on: Mar 25, 2026 3:25PM

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పాత మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి కోవెలను మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు, తెలుగుదేశం స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం మంత్రి లోకేష్ సీతారామస్వామి వార్లను దర్శించుకుని ఆశీర్వాచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


.webp)



