ఒక లోకేష్... మూడు ముఖ్యాంశాలు

posted on: Feb 16, 2026 3:26PM

 

ఈ మ‌ధ్య మంత్రి లోకేష్ త‌న  సూప‌ర్ ఫాస్ట్ యాక్టివిటీస్ కార‌ణంగా త‌ర‌చూ వార్త‌ల‌కు ఎక్కుతున్నారు. మొన్న‌- ఎంపీ ఎమ్మెల్యేల‌తో లంచ్ మీటింగ్- ఆ వెంట‌నే నిన్న‌ కొలంబో మ్యాచ్‌లో చీరింగ్- ఇంత‌లో నేడు ఏపీకి బిల్ గేట్స్ రాగానే ఇక్క‌డికి వ‌చ్చి ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం.

దీంతో సోష‌ల్ మీడియాలో లోకేష్ వేగ‌వంత‌మైన ప‌నిత‌నానికి మంచి మార్కులే ప‌డుతున్నాయ్. ఎందుకంటే మ‌నిష‌న్నాక కూశింత క‌ళాపోష‌ణ  ఉండాలంటారు. అలా ఇంత  ప‌ని ఒత్తిడిలోనూ ఆట  పాట‌ల మీద కూడా శ్ర‌ద్ధ చూపెట్ట‌డం ఎంతైనా అవ‌స‌రం. 

త‌న  తండ్రిలా  కేవ‌లం  ప‌ని- ప‌ని- ప‌ని అంటూ అలాగే  ఉండిపోకుండా లోకేష్ ఇదిగో క్రికెట్ మ్యాచ్ ల‌కు సైతం హాజ‌రు కావ‌డం కూడా ఒకందుకు మంచిదేన‌ని భావిస్తున్నారంతా. ఒక నాయ‌కుడ‌న్నాక అన్ని విష‌యాల ప‌ట్ల దృష్టిసారించ‌డం మేలు చేసే విష‌య‌మే. 

ఇప్ప‌టి వ‌ర‌కూ దేశ క్రికెట్‌లో ఆంధ్ర‌ప్రాతినిథ్యం పెద్ద‌గా ఉండ‌టం లేదు. అట్ లీస్ట్ ఐపీఎల్ జ‌ట్టును కూడా  హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ అంటూ త‌మిళియ‌న్స్ న‌డుపుతున్నారు. అదే ఏపీకి  అంటూ ఒక జ‌ట్టు ఎంతైనా అవ‌స‌రం. ఇక్క‌డి యువ‌త‌కు ఈ దిశ‌గా కొంత అవ‌కాశాలు క‌ల్పించవ‌చ్చు. వీట‌న్నిటిపై ఒక అవ‌గాహ‌న పెంచుకునేందుకు లోకేష్ ఇటీవ‌ల తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ఇంత బిజీగా ఉండి  కూడా మేడారం జాత‌ర‌లో వ‌లీ  అనే కోవాబ‌న్ వ్యాపారి  పై జ‌రుగుతున్న ఒక ట్రోలింగ్‌కి చెక్ పెట్టేలా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు లోకేష్.  అతిత్వ‌ర‌లోనే సోద‌రుడు వ‌లీ చేతి- కోవా బ‌న్ రుచి చూస్తాన‌ని త‌న ట్వీట్ ద్వారా తెలియ చేశారు లోకేష్.

దీంతో లోకేష్ ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ స‌హృద‌య‌త మీద కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప‌నంటే కేవ‌లం  ప‌నిలోనే మునిగిపోకుండా అప్పుడ‌ప్పుడూ ఇలాంటి అంశాల  ప‌ట్ల కూడా స్పందిస్తూ లోకేష్ చూపుతున్న ఈ చొర‌వ‌.. వేగం.. తేజం.. స‌హృద్భావం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి  అవ‌స‌ర‌మైన  యువ- న‌వ- తేజం లోకేష్ రూపంలో అందివ‌చ్చింద‌ని.. ఇది రాష్ట్ర స‌ర్వ‌తోముఖాభివృద్ధికి బాట‌లు ప‌రుస్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది స‌ర్వ‌త్రా.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...