Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్
posted on: May 6, 2026 2:22PM

ప్రముఖ ఏసీ తయారీ కేంద్రం క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి నారా లోకేశ్ బుధవారం (6-5-26న) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం శ్రీసిటీలో నుంచి సరఫరా చేయబోతోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక్క వాట్సాప్ మేసేజ్‌తో చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
శ్రీసిటీలో 70 వేల మంది ఉద్యోగుల్లో 35 వేల మంది మహిళలు ఉన్నారని.. శ్రీశక్తికి ఇది నిదర్శనమన్నారు. శ్రీసిటీలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరులోపు ఏఐ ద్వారా నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నామని లోకేశ్ వెల్లడించారు. శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభించనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 40 ఎకరాల స్థలం కేటాయించారు. ఒకటి, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1000 టన్నుల నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్ సిస్టమ్స్‌ను క్యారియర్ సంస్థ తయారుచేయనుంది. బుధవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.






