Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీ లాబీలో విద్యార్థులతో మంత్రి లోకేష్ సంభాషణ
posted on: Feb 25, 2026 1:48PM

పిల్లలే రాష్ట్ర భవిత అనీ, రాబోయే కాలంలో చరిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేనని, ఇంగ్లీషులో చదువుకుంటున్నా, అమ్మలాంటి తెలుగుభాషను మరువొద్దని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు. అసెంబ్లీ చూడటానికి బుధవారం వచ్చిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో లాబీలో మంత్రి మాట్లాడారు. `అసెంబ్లీ చూడటం ఎలా వుంది? మీరు చూస్తున్నప్పుడు అసెంబ్లీలో ఏ అంశంపై చర్చ జరిగింది?` అని ప్రశ్నించారు.
అసెంబ్లీ కార్యకలాపాలు ప్రత్యక్షంగా చూడటం వల్ల చాలా విషయాలు తెలిశాయని, తాము చూసిన చర్చను లోకేష్‌కు వివరించారు. కెరీర్, ఎడ్యుకేషన్ కోసం ఇంగ్లీషులో నైపుణ్యం కనబరుస్తూనే.. మాతృ భాష తెలుగును మర్చిపోవద్దని పిల్లలకు హితబోధ చేశారు. విదేశాల్లో ఎక్కువ కాలం చదువుకోవడం వలన మొదట్లో తెలుగు రాక తాను ఇబ్బంది పడిన విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్ ఎలా ఉంది? టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు? మధ్యాహ్నం భోజనం రుచిగా ఉంటుందా? రాగిజావ అందుతోందా? అని మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు.


.webp)
.webp)


