అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్

posted on: Mar 9, 2026 4:03PM

 

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.61 లక్షల నిధులు వెచ్చించి అన్న క్యాంటీన్ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా దుగ్గిరాల చేరుకున్న మంత్రి లోకేష్‌కు  టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్షయపాత్ర సిబ్బందితో కలిసి మంత్రి లోకేష్ సామాన్య ప్రజానీకానికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేసమనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...