మహా పడిపూజలో మంత్రి లోకేష్
posted on Nov 5, 2025 9:30AM

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం (అక్టోబర్ 4)నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం మహా పడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక బాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అతడితో ముచ్చటించడం ఆకట్టుకుంది.