సచిన్ కుమారుడు పెళ్లికి హాజరైన మంత్రి లోకేశ్ దంపతులు

posted on: Mar 5, 2026 1:56PM

 

 

క్రికెట్ దిగ్గజం సచిన్  టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు వివాహం ఈరోజు ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. లోకేశ్‌ దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేశ్‌ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లి మహోత్సవానికి ఐసీసీ ఛైర్మన్ జైషా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై  జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...