మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి

posted on: Feb 17, 2026 3:26PM

 

నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలోని గుండ్రం పల్లి వద్ద జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాన్ని గమనించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి.. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి... తన మానవ త్వాన్ని చాటుకున్నారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదానికి గురై గాయాలతో పడి ఉన్న బాధితులను చూసి చలించిపోయాడు. తక్షణమే తన కాన్వాయ్‌ను  ఆపించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మంత్రి ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించారు. 

బాధితులకు సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాపాయం కలగవచ్చని భావించి వెంటనే మంత్రి స్పందించడం స్థానికులను ఆకట్టుకుంది. అక్కడితో ఆగకుండా ఆసుపత్రి వైద్యులతో మంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రు లకు అత్యవసర వైద్యస సహాయం అందించాలని సూచించారు. అవసరమైన అన్ని పరీక్షలు చేసి మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

మంత్రివర్యులు చూపిన చురుకుదనం, మానవతా దృక్పథం స్థానిక ప్రజలను కదిలించింది. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను గుర్తించి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన మంత్రిని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.రోడ్డు ప్రమాదాలను గమనించినప్పుడు వెంటనే సహాయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...