Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నగల దుకాణంలో అర్ధరాత్రి దొంగతనం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు
posted on: May 20, 2026 10:19AM

హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్‌లో అర్ధరాత్రి జరిగిన జువెలరీ షాప్ చోరీ సంచలనం సృష్టించింది. ఎంఎల్ఆర్ కాలనీలోని గురుదత్త జ్యువెలరీ షాప్‌ను టార్గెట్ గా చేసుకున్నగుర్తుతెలియని దుండగులు, షాప్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. షాప్ లోని బంగారు-వెండి ఆభ రణాలను వెతికి వెతికి సుమారు 4 లక్షల రూపాలయ విలువైన నగలను సర్దుకొని పరారయ్యారు.
ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన యజమాని సురేష్ కుమార్ షాపులో వస్తువులు చెల్లాచెదురుగా కనిపించ డంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే మీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు.సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
షాప్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డ్ కావడంతో.. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. దుండగులను గుర్తించేం దుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు.






