Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మైక్రో ఫైనాన్స్ వివాదం: మరో వీడియో విడుదల చేసిన సింగర్ మంగ్లీ
posted on: Apr 16, 2026 12:23PM
.webp)
మైక్రో ఫైనాన్స్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయని మంగ్లీ మరో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఇమె మైక్రో ఫైనాన్స్ అన్న పదమే తనకు తెలియదని పేర్కొన్నారు. తనపై ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ.. సీపీ సజ్జనార్ తో పాటు, డిజిపి కి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగామరో వీడియో విడుదల చేశారు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో పునరుద్ఘాటించారు. తనపై ఇంత పెద్ద అభియోగం రావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలకు పూర్తిగా సహకరిస్తానన్న మంగ్లీ, ఈ ఫైనాన్స్ చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదానికి తనకూ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కమ్యూనిటీ కార్యక్రమంలో మాత్రమే రామావత్ మధును కలిసినట్లు చెప్పారు.
తన తమ్ముడు శివ పేరు కూడా ఈ వివాదం లో లాగడం బాధాకరమని మంగ్లీ పేర్కొన్నారు. చీటింగ్ వ్యవహారంలో తన పేరును వాడుతున్నాడని తెలిసిన వెంటనే మధుపై ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా బాధితురాలినేనని చెప్పుకున్నారు. . డబ్బులు ఇచ్చి బాధితులు మోసపోతే అకారణంగా తనపై బురద చల్లి ఇబ్బందు లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






