Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ట్రక్కు కిందకు దూసుకెళ్లిన మైఖేల్ క్లార్క్ కారు!
posted on: Jun 5, 2026 5:21PM

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు వేళ క్రికెట్ ప్రపంచాన్ని ఒక ఊహించని భయానక ఘటన ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 31న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఈ రసవత్తర పోరులో ఆర్‌సీబీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు అధికారిక కామెంట్రీ ప్యానెల్‌లో భాగమైన ఆస్ట్రేలియా మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆ రాత్రి కామెంట్రీ బాధ్యతలు ముగించుకుని తిరుగుప్రయాణమయ్యాడు. కానీ ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్ హైవేలపై ఒకే రాత్రి రెండు భారీ ప్రమాదాలు జరగడం గమనార్హం. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా ఆటగాళ్లంతా రోడ్డుపైనే చిక్కుకుపోగా, మరోవైపు మైఖేల్ క్లార్క్ ప్రయాణిస్తున్న కారు దారుణమైన రహదారి ప్రమాదానికి గురైంది.
ఆ భయంకరమైన రాత్రి జరిగిన ప్రమాదం గురించి మైఖేల్ క్లార్క్ తాజాగా బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సంచలన విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అలసట కారణంగా కారు ముందు సీట్లో కూర్చుని తాను గాఢనిద్రలోకి జారుకున్నట్లు తెలిపాడు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత విమానాశ్రయానికి వెళ్తున్న క్రమంలో ఒక భారీ సెమీ ట్రైలర్ ట్రక్కును వీరి కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ట్రక్కు బ్రేక్ లైట్లు వెలగకపోవడం వల్లే తీవ్ర గందరగోళం ఏర్పడిందని, వేగంగా వెళ్తున్న తమ కారు నేరుగా ఆ భారీ ట్రక్కు కిందకు దూసుకువెళ్లిందని క్లార్క్ వివరించాడు. ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దానికి నిద్రలేచి చూసేసరికి కారు ముందు భాగం సగానికి పైగా పూర్తిగా నలిగిపోయి ఆ ట్రక్కు కింద ఇరుక్కుపోయి ఉండడం చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి, భయానికి గురయ్యానని చెప్పాడు.
కారు ముందు భాగం అంతలా ధ్వంసమైనప్పటికీ, మైఖేల్ క్లార్క్‌కు కేవలం కొన్ని చిన్న చిన్న స్క్రాచెస్, గాయాలతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే ప్రమాద తీవ్రతకు కారు డ్యాష్‌బోర్డ్ వెనుకకు నెట్టబడడంతో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరిగిపోయి ఉంటుందని క్లార్క్ అనుమానం వ్యక్తం చేశాడు. ఆ కారు డ్రైవర్ సొంత వాహనం కాదని, ఒక ప్రైవేట్ కంపెనీ తరఫున ఉపాధి కోసం నడుపుతున్నందున కారు ముక్కలైపోవడాన్ని చూసి ఆ డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరిస్తూ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడని క్లార్క్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వారికి అండగా నిలిచారు. ప్రత్యామ్నాయ వాహనం వచ్చే వరకు దాదాపు గంటపాటు క్లార్క్ రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన భారతీయ ప్రజల మంచితనానికి, అలాగే తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అండగా నిలిచిన బీసీసీఐ అధికారులకు క్లార్క్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. భగవంతుడి దయ వల్లే తాను క్షేమంగా ఆస్ట్రేలియాలోని తన ఇంటికి చేరుకోగలిగానని ఈ క్రికెట్ దిగ్గజం ఎమోషనల్ అయ్యాడు.


.webp)



