ఇప్పుడు ఉన్న భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదు : సీఎం చంద్రబాబు
posted on: Feb 6, 2026 2:49PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే అన్నదాత కరోనా సమయంలో సైతం పని చేశారని గుర్తు చేశారు. జీవితంలో ఎవరూ మీ భూమి కబ్జా చేయకుండా రక్షణ కల్పించానని ప్రజలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని నేను ఇక్కడే పుట్టా.. ఎన్టీఆర్ కుడా రాయలసీమ ముద్దు బిడ్డే.. ఎన్టీఆర్ హిందూపురం నుంచే పోటీ చేశారని చంద్రబాబు అన్నారు.
ఇప్పుడు జగన్ వచ్చి నా రాయలసీమ అంటున్నారు. మేము ఇరిగేషన్‌కు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే...జగన్ రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశారని సీఎం తెలిపారు. మూడేళ్లలో కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తిచేసే బాధ్యత నాదే అని చంద్రబాబు అన్నారు. క్యూ ఆర్ కోడ్ వల్ల మీ సెల్ ఫోన్‌లో మీ ల్యాండ్ మీకు కనిపిస్తుందని వివరించారు. తాను నాలుగో సారి ముఖ్యమంత్రిని అయ్యానని.. ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.
మీ రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రమని ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకేని వదిలిపేట్టేది లేదని సీఎం అన్నారు. దేవాలయ ప్రసాదాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయంలో ఐదేళ్లు కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. బాత్ రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తొ నెయ్యి తయారు చేశారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రసాదంలోను కల్తీ జరిగిందని స్పష్టం చేశారు టీటీడీ నెయ్యిలో కల్తీ జరిగిందని మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డే ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.



.webp)


