ఆస్తి కోసం సోదరి భర్తను చంపిన ఎంజీఆర్ కూతురు..

posted on: Jul 14, 2016 6:51PM

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీరామచంద్రన్ అల్లుడు హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎంజీఆర్ పెంపుడు కుమార్తె భాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవితఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న ఆళ్వారుపేటలో దారుణహత్యకు గురయ్యారు. కారుతో గుద్ది, ఇనుపరాడ్లతో మోది చంపారు. ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును తొలుత అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ..ఆ తర్వాత సీబీసీఐడీకి అప్పగించారు.

 

ఎనిమిదేళ్లపాటు సాగిన దర్యాప్తులో సుమారు 70 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. ఎంజీఆర్ తన భార్య జానకి సోదరుడు ఏడుగురి పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే ఆయన ఆస్తి కోసం సుధ, భాను శ్రీధర్‌ల మధ్య వివాదం చేలరేగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి సుధ భర్తను భాను శ్రీధర్ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇందుకు గాను కరుణకు భాను రూ.4 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. భాను శ్రీధర్‌కు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది. న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే విజయన్ భార్య సుధ స్పందిస్తూ తన భర్తకు చివరికి న్యాయం దక్కిందని చెప్పారు. ఇందుకు సహకరించిన పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు

google-ad-img
    Related Sigment News
    • Loading...