Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల టోకరా...సుబ్బారెడ్డి అరెస్ట్
posted on: Jun 6, 2026 4:10PM

తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న మెసారా ఇన్ఫ్రా డెవలపర్ అధినేత మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డిని మాదాపురం పోలీసులు అరెస్టు చేశారు. సుబ్బారెడ్డి శనివారం ఉదయం హైటెక్ సిటీలో ఒక హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సమాచారం తెలుసుకున్న బాధితులు, మాదాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సుబ్బారెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న హోటల్ కి వెళ్లిన పోలీసులు, సుబ్బారెడ్డిని అరెస్టు చేశారు. ఏపీలో కూడా సుబ్బారెడ్డి పై కేసులు నమోదై ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో పెంచల సుబ్బారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పను కూడా కోటి రూపాయలు మోసం చేసిన దాంట్లో సుబ్బారెడ్డి పై గద్వాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఇతను గత రెండేళ్లుగా వివాదాస్పద భూములపై ఫ్రీ లాంచ్ వెంచర్లంటూ అందమైన బ్రోచర్లతో వందలాదిమందిని ముంచి సుమారు రూ.100 కోట్లకు పైగా దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు బాధితులకు చిక్కిన మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి మాదాపురం పోలీసులు అదుపులో ఉన్నాడు. లేని భూమిని ఉన్నట్టు చూపించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న సుబ్బారెడ్డి ఇప్పుడు అరెస్టు అయ్యాడు.






