Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాపం ఆ ఇద్దరు చిన్నారులు!
posted on: Mar 1, 2026 4:36PM

వేట్లపాలెం ఘటనలో మృతుడి పిల్లలకు మానసిక వైకల్యం
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా పేలుడు తీవ్ర విషాదం మిగిల్చింది. 24 మంది మరణించిన ఆ దుర్ఘటనలో ఒక్కో మృతుడి వెనుక ఒక దీనగాధ బయటపడుతోంది. ఆ ఘటనలో మరణించిన లోవరాజుకు ఇద్దరు మానసిక వైకల్యం ఉన్న పిల్లలున్నారు. కనీసం తండ్రి చనిపోయాడని విషయం కూడా వారికి తెలియదు.
ఆ ఇద్దరు పిల్లలు ఇంత వరకు కనీసం ఏ ఫంక్షన్‌కి కూడా రాకుండా ఇంటికే పరిమితమవుతున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.లోవరాజు ఒక్కడే కుటుంబ పోషణ మొత్తం చూసుకునేవారు. ఇప్పుడు ఆయన మరణించడంతో రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని లోవరాజు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.. వంద శాతం మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఇద్దరికీ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసి వారి కుటుంబానికి బాసటగా నిలబడాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.
ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాల్లో పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు ప్రకటించి ఉన్నారు.






