Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలీవుడ్ పై మేనక గాంధీ సంచలన వ్యాఖ్యలను ఎవరెలా తీసుకుంటున్నారు
posted on: Apr 8, 2017 6:20PM

శుక్రవారం గోవా ఫెస్ట్‌కు హాజరైన కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాల పెరుగుదలకు బాలీవుడ్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ కొందరు సమర్ధించగా మరి కొందరు ఖండించారు.
కొన్ని మహిళా సంఘాల నేతలు మేనక గాంధీకి బాసటగా నిలిచారు. "సినిమాలు నిజంగానే యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంచి కన్నా చెడుని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈవ్ టీజింగ్, మహిళలపై అకృత్యాలు వంటివి బాలీవుడ్ ప్రభావం వల్ల జరుగుతున్నాయి," అని ఒక ప్రముఖ మహిళా నేత తన అభిప్రాయం వెలిబుచ్చారు.
మరో వైపు కొందరు బాలీవుడ్ దర్శక-నిర్మాతలు మేనక గాంధీ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. సినిమా పరిశ్రమ శక్తిని తక్కువగా చూడొద్దని నిర్మాత అశోక్ పండిట్ కోరారు. సినీ పరిశ్రమపై విమర్శలకు దిగడం ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. చాలా మంది అగ్రదర్శకులు మహిళా ప్రధాన సినిమాలను తీశారని గుర్తుచేశారు.


.jpg)



