Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీకి ముప్తీ మహబూబా షరతులు.. కాంగ్రెస్ తో జతకట్టేందుకా.?
posted on: Jan 11, 2016 11:46AM

జమ్ము కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి చెందిన అనంతరం.. ఆ పదవిని తన కూతురు ముప్తీ మహబూబాకు కట్టబెట్టాలని పీడీపీ నేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మరణం తర్వాత ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు ముగిసేవరకూ తాను ప్రమాణ స్వీకారం చేయబోనని మహబూబా ముఫ్తీ చెప్పారు. దీంతో, ఈ వారం ఆమె బాధ్యతలు చేపట్ట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ వరకూ బానే ఉన్న ఇక్కడే అసలు రాజకీయం బయటపడుతోంది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి చెందిన నేపథ్యంలో ముఫ్తీని మహబూబాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు విడివిడిగా ఆమెను కలిసి పరామర్శించారు. దీంతో పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము కలిసింది ముఫ్తీని మహబూబాను పరామర్సించడానికే అని వారు చెబుతున్నా.. అందులో వేరే రాజకీయ ఉద్దేశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో జమ్ము కాశ్మీర్లో రాజకీయం వేడెక్కుతోంది.
ఎందుకంటే ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతి అనంతరం ముప్తీ మహబూబాను సీఎం చేయాడానికి మద్దతు తెలిపిన వారిలో బీజేపీ ఉంది. ముప్తీ మహబూబాకు పూర్తి మద్దతిస్తామని బీజేపీ తెలిపింది. కానీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న ముప్తీ మహబూబా మాత్రం బీజేపీకి కొన్ని షరతులు పెట్టిందంట. అదేంటంటే.. ఉప ముఖ్యమంత్రి పదవులు.. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వంటి కీలక పదవులు బీజేపీ ఇవ్వమని అడగవద్దని.. అలా అయితేనే బీజేపీ-టీడీపీ కలిసి ఉంటుందని ఖచ్చితంగా చెప్పారంట. దీంతో బీజేపీ పార్టీ నేతలు షాక్ తిన్నా.. దానికి కౌంటర్ గా వారు కూడా మరో షరతు పెట్టారంట. అది ముఖ్యమంత్రి పదవిని కొన్నేళ్లు పిడిపి, మరికొన్నేళ్లు బిజెపికి చెందిన వారు కొనసాగించాలని అన్నారంట. కానీ దీనికి ముప్తీ మహబూబా ఒప్పుకోలేదట.
ఇదిలా ఉండగా ముప్తీ మహబూబా ఇలాంటి షరతులు విధించడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని బీజేపీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీతో మాట్లాడిన తరువాతే ముప్తీ మహబూబా ఇలా అంటున్నారని.. కాంగ్రెస్ తో జతకట్టేందుకే ఇలాంటి షరతులు విధిస్తున్నారని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి పిడిపి వర్సెస్ బీజేపీ లా తయారైంది. మరి బీజేపీ షరతులకు పిడిపి ఒప్పుకుంటుందా.. పిడిపి షరతులకు బీజేపీ ఒప్పుకుంటుందా.. లేక కాంగ్రెస్ తో జతకడుతుందా ఈ విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


.jpg)



