మెహబూబాకు సహచరుల హెచ్చరిక

posted on: Mar 15, 2016 12:59PM

కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ చనిపోయి ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నాయి. అయినా ఆయన వారసురాలు మెహబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీనమేషాలు లెక్కబెడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని సానుకూల సంకేతాలు పంపాలని ఓసారి, రాష్ట్రంలోని బీజేపీ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని మరోసారి... పూటకోసారి, రోజుకోమాట చెబుతూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. దీంతో మెహబూబాకి సొంత పార్టీ నుంచే హెచ్చరికలు మొదలవుతున్నట్లు సమాచారం. రోజులు గడిచేకొద్దీ ప్రజల్లో అవిశ్వాసం పెరిగిపోతోందనీ, గవర్నరు పాలన ఏర్పడే సూచనలు బలపడుతున్నాయనీ వారు నేరుగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట.

కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటులో ఇంత ఆలస్యం జరిగినందుకు తప్పకుండా రాష్ట్రపతి పాలనను విధించేసేవారే అన్న విమర్శలూ పదునెక్కుతున్నాయి. దీంతో మెహబూబా తన బెట్టుని వదిలిపెట్టి, ప్రభుత్వ ఏర్పాటు గురించి త్వరలోనే ఒక నిర్ణయానికి రాక తప్పని స్థితి వచ్చేసింది. లేకపోతే తన పార్టీ (పీడీపీ) సహచరులు ఆమెను కాకుండా మరొకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించేసి, వారే ప్రభుత్వాన్ని ఏర్పరిచే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. మరి ‘ఆలస్యంతో అధికారం దూరం’ అన్నది నేటి మాట!

google-ad-img
    Related Sigment News
    • Loading...