రాజకీయ కారణాలతోనే మెహబూబ్ నగర్ బంద్?

posted on: Jul 10, 2015 9:59AM

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలమూరు ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసినందుకు నిరసనగా ఈరోజు మెహబూబ్ నగర్ జిల్లాలో అధికార తెరాస బంద్ నిర్వహిస్తోంది. తెరాస ఎమ్మేల్యేలు శ్రీనివాస్ గౌడ్, మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ వ్రాసినంత మాత్రాన్నే బంద్ నిర్వహించడం చూస్తే, ప్రజల దృష్టిలో తమ పార్టీని దోషిగా నిలబెట్టి అప్రదిష్టపాలు చేసేందుకేనని తెదేపా నేతలు భావిస్తున్నారు.

 

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి పిర్యాదులు చేసుకొంటూ, అనేక అంశాల మీద అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి ఇంతవరకు అనేక లేఖలు వ్రాసుకొన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి ఈవిధంగా ఎన్నడూ బందులు నిర్వహించలేదు. కానీ చంద్రబాబు కేంద్రానికి లేఖ వ్రాసారనే సాకుతో అధికారంలో ఉన్న తెరాసయే బంద్ నిర్వహించడం రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్నదే తప్ప మరొకటి కాదని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీ త రాజకీయ ప్రత్యర్ధిని దెబ్బ తీసేందుకు ఈవిధంగా ఊహాజనితమయిన సమస్యలను సాకుగా చూపుతూ బంద్ నిర్వహించడం కేవలం బాధ్యతారాహిత్యమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లయితే తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ వ్రాసి తన అభిప్రాయాలు తెలుపవచ్చును. కానీ ఆ పని చేయడం మాని అధికార పార్టీయే స్వయంగా బంద్ కి పిలుపునీయడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...