Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Ustaad Bhagat Singh: మెగాస్టార్ మెచ్చిన ఉస్తాద్.. అన్నయ్య ట్వీటు చేస్తే హీటు పెరిగినట్టే!
posted on: Mar 15, 2026 7:00PM

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.
సినిమా ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని చిరంజీవి కొనియాడారు. "మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే" అని అని ఆయన ట్వీట్ చేశారు. ట్రైలర్ లింక్‌ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు.
మెగాస్టార్ ప్రశంసలపై దర్శకుడు హరీష్ శంకర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ, సమయం కేటాయించి మరీ ట్రైలర్ చూసి అభినందించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.
"అయ్యబాబోయ్... అన్నయ్య. మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజులో నచ్చిందో నాకర్థమైంది. మీరు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని తెలిసింది, అయినా సరే వీలు చేసుకుని మా ట్రైలర్ చూసినందుకు, అభినందనలు తెలిపినందుకు నా ఆనందానికి అవధులు లేవు. మెగా ఆశీర్వాదం' కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్ల డమే, ఎందుకంటే.. "మీరు ట్వీటు పెడితే...హీటు పెరిగినట్టే" అంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. నేడు (మార్చి 15) హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.
https://x.com/harish2you/status/2033053569335833066






