Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో నటుడు రమేశ్.. అండగా నిలిచిన మెగాస్టార్..!
posted on: Jul 26, 2026 3:40PM

గబ్బర్ సింగ్ నటుడు రమేశ్ కుటుంబానికి రూ. 3 లక్షలు అందించిన చిరంజీవి..!
సినీ పరిశ్రమలో తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి ఆయన ఆర్థిక, మానసి కంగా అండగా నిలిచారు. 'గబ్బర్ సింగ్' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రమేశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై బ్రెయిన్ స్ట్రోక్‌తో అపోలో ఆస్పత్రి ఐసీయూలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ టీం సభ్యులు ఆస్పత్రికి వెళ్లి రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి ద్వారా సమాచారం అందుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, అత్యుత్తమ వైద్యం అందిం చాలని కోరారు. అనంత రం రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి చికిత్స ఖర్చుల కోసం రమేశ్ భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు.
ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. రమేశ్ త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా తన వంతు బాధ్యతగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు మెగా కుటుంబం మరోసారి అండగా నిలవడంపై సినీ ప్రముఖులు, అభిమా నులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Megastar Chiranjeevi, Actor Ramesh Gabbar Singh, Chiranjeevi donation actor Ramesh,
Megastar Chiranjeevi financial help, Actor Ramesh brain stroke, Nagababu donation actor Ramesh,
Harish Shankar, Apollo Hospital






