చిరు సినిమాకు షాక్... అదనపు వసూళ్లపై కోర్టులో పిటిషన్

posted on: Jan 24, 2026 12:33PM

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పెంచిన టికెట్ రేట్ల ద్వారా అక్రమంగా వసూలు చేసిన రూ.42 కోట్లను రికవరీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేక మెమో జారీ చేసి ఈ వసూళ్లు జరి పారని ఆరోపిస్తూ న్యాయ వాది పాదూరి శ్రీనివాసరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చిన రూ.42 కోట్ల వసూళ్లపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీఎస్టీ అధికారులను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. 

మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఈ నెల 8వ తేదీన ఒక మెమో జారీ చేశారు. ఆ మెమో ప్రకారం ప్రత్యేక షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించడం తో పాటు, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 మేర టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఈ టికెట్ ధరల పెంపు కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధ మని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసి, నిర్మాతలు మరియు సంబంధిత వర్గాలు అక్రమంగా రూ.42 కోట్ల వరకు వసూలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈవిధంగా పెంచిన టికెట్ రేట్ల వల్ల ప్రజలపై భారం పడిందని, కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి ప్రభుత్వం వ్యవహరించిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ విధంగా అక్రమంగా వసూలు చేసిన రూ.42 కోట్లను ప్రభుత్వ ఖజానాకు తిరిగి రికవరీ చేయాలని  పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా, ఈ మొత్తం వసూళ్లకు సంబంధించిన పూర్తి లెక్కలు, జీఎస్టీ చెల్లింపుల వివరాలను కూడా సమర్పించాలని డిమాండ్ చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...