మేడారం మహాజాతర హుండీ లెక్కింపు షురూ!

posted on: Feb 5, 2026 12:13PM

మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు అధికారులు మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభించారు.

మేడారం మహాజాతర లో ఏర్పాటు చేసిన ఎనిమిది వందలకు పైగా హుండీలను ఆర్టీసీ కార్గో ద్వారా హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థాకం కల్యాణ మంటపానికి చేర్చారు. అక్కడ హుండీల లెక్కింపును అన్ని ఏర్పాట్లూ చేసి గురువారం (ఫిబ్రవరి 5) ఉదయం  లెక్కింపు మొదలు పెట్టారు.  ఈ హుండీల లెక్కింపునకు ఎంత లేదన్నా పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి మేడారం మహాజాతరకు అంచనాలకు మించి జనం రావడంతో హుండీ ఆదాయం భారీగా ఉంటుందని అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...