మేడారం మహాజాతర.. నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం.. గద్దెపైకి తరలి రానున్న సమ్మక్క
posted on: Jan 29, 2026 1:41PM

తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజారరలో అత్యంత ప్రధాన ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. బుధవారం (జనవరి 28) సారెలమ్మ గద్దెపై కొలువుదీరగా, గురువారం (జనవరి 29) సమ్మక్క భక్తకోటిని ఆశీర్వదించేందుకు గద్దెపైకి తరలిరానుంది. చిలుకలగుట్ట నుంచి తల్లి సమ్మక్కకు ములుగు కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అధికారికంగా అమ్మవారికి ఆహ్వానం పలుకనున్నారు.
ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గురువారం (జనవరి 28) సాయంత్రం పూజారులు చిలుకలగుట్టపైకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో చిలుకలగుట్ట నుంచి గద్దెల వరకు సాగే ఈ ప్రయాణంలో దారి పొడవునా, భక్తులు కోళ్లు, మేకల మొక్కులు చెల్లిస్తూ అమ్మవారికి స్వాగతం పలికారు.
ఈ ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు వీఐపీలు హాజరయ్యే అవకాశం ఉంది. అమ్మవారి రాక సమయంలో తొక్కిసలాట జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్లు, హెలికాప్టర్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపైకి చేరడంతో వనదేవతలందరూ కొలువుదీరినట్లవుతుంది.ఇక శుక్రవారం(జనవరి 30) భక్తులు అమ్మవార్లకు బెల్లం (బంగారం) సమర్పించుకుంటారు. శనివారం(జనవరి 31) వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.



.webp)


