మేడారం మహాజాతర.. హుండీ ఆదాయం రూ.13.35 కోట్లు

posted on: Feb 12, 2026 11:31AM

మేడారం మహాజాతరలో హుండీ ఆదాయం 13 కోట్ల పాతిక లక్షల రూపాయలు వచ్చింది.  ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం (ఫిబ్రవరి 11) ముగిసింది.  

ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన మొత్తం  మొత్తం 828 హుండీలను తెరిచి నగదు, ఆభరణాలను లెక్కించారు. దాదాపు 400 మందికి పైగా సిబ్బంది  దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. మొత్తం హుండీలను లెక్కించిన తరువాత మేడారం మహా జాతర హుండీల ఆదాయం .13,25,83,269 రూపాయలను అధికారులు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...