Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీలో మావిగన్ చిచ్చు.. జగన్ పై లీడర్, క్యాడర్ గుర్రు
posted on: May 8, 2026 8:51AM

వైసీపీలో ప్రస్తుతం ‘మావిగన్’ చిచ్చు రేపుతోంది. అమరావతికి బదులుగా రాష్ట్ర రాజధానిగా మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటన వైసీపీలో నిట్టనిలువుగా చీలిక వచ్చేలా కనిపిస్తోందన్న అభిప్రాయం పరిశీలకులనుంచి వ్యక్తం అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ జగన్ చేసిన ప్రతిపాదన ప్రకంపనలు పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అంతకు మించి నష్టం చేరుస్తుందని అంతర్గత సంభాషణల్లో గట్టిగా చెబుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన సోదరులు మావిగన్ తో విభేదిస్తున్నారు. జగన్ ప్రతిపాదనపై వారిరువురూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. జగన్ ఎవరితో చర్చించి మావిగన్ అన్నారని వారు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు అయితే మావిగన్ విషయంలో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో అయితే.. మావిగన్ పై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత కూడా మావిగన్ ప్రకటనను తప్పుపట్టారు. పార్టీలో సీనియర్లతో కనీసం చర్చించకుండా జగన్ చేసిన ప్రకటేన సరికాదన్నారు. సీనియర్లతో చర్చించాలన్న ఆలోచన కూడా జగన్ చేయకపోతే.. ఇక తాము పార్టీలో ఉండి ప్రయోజనమేంటన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


.webp)



