Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
posted on: Mar 23, 2026 11:15AM
.webp)
భాగ్యనగరంలో వరుసగా జరుగుతున్న చోరీలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు రెక్కీ నిర్వహించి మరీ దోపిడీకి పాల్పడుతున్న తీరు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంటికి తాళం వేసి ఆ ఇంట్లోని వారి బయటకు వెళ్లిన గంట వ్యవధిలోనే చోరీకి పాల్పడి ఇల్లు గుల్ల చేస్తున్న తీరు విస్మయం గొలుపుతోంది. తాజాగా అత్తాపూర్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఈ తరహాలోనే భారీ చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్ పరిధిలోని జలాల్ బాబా నగర్‌లో నివాసం ఉంటున్న ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో పక్కా ప్రణాళిక మేరకు అత్యంత చాకచక్యంగా చోరీ జరగింది. ఫిరోజ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అవకాశంగా దుండగులు ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన ఫిరోజ్ కుటుంబం గంట తరువాత తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్ట బడి ఉండటాన్ని గమనించి షాక్‌కు గుర య్యారు. లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని అల్మారాలోని సుమారు రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలు సేకరి స్తున్నారు.
ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేసి నింది తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి గంటలో తిరిగి వచ్చేసరికే ఇంత భారీ చోరీ జరగడంతో దుండగులు ముందుగా రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళిక మేరకు పకడ్బందీగా చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


.webp)
.webp)


