ఒరాకిల్ లో భారీ రిట్రెంచ్ మెంట్
posted on: Feb 3, 2026 8:21AM

టెక్ దిగ్గజం ఒరాకిల్ లో భారీగా రిట్రెంచ్ మెంట్ కు రంగం సిద్ధమైంది. కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం చేసిన భారీ ఇన్వెస్ట్ మెంట్ కారణంగా ఏర్పడిన నిధుల కొరత కారణంగా దాదాపు 30,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ఒరాకిల్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ నివేదిక వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదగాలనే ఉద్దేశంతో శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపన్ ఏఐ కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 156 బిలియన్ డాలర్ల వ్యయం చేస్తోంది. కానీ ఒరాకిల్ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలతో అమెరికా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధుల కొరతను అధిగమించేందుకు భారీగా ఉద్యోగులను రిట్రెంచ్ చేయాలని ఒరాకిల్ కంపెనీ భావిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ లేఆఫ్స్ ప్రభావం ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై పడే అవకాశం ఉందని అంటున్నారు.


.webp)



