గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్

posted on: Feb 6, 2026 8:44PM

 

గత రెండు రోజులుగా కొనసాగిన కాల్పుల్లో మొత్తం 7 మంది మావోయిస్టులు హతమయ్యారని గడ్చిరోలి జిల్లా పోలీసులు అధికారికంగా వెల్లడించారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ కీలక మావోయిస్టు నేత కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇన్‌చార్జ్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్, CPI (మావోయిస్టు) 10వ నంబర్ కంపెనీ ఇన్‌చార్జ్ ప్రభాకర్ ఉన్నారని వెల్లడించారు. ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా నివాసిగా పోలీసులు గుర్తించారు.

ప్రభాకర్‌పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందని అధికారులు తెలిపారు. అతడితో పాటు మరో ఆరు మంది హార్డ్‌కోర్ మావోయిస్టులు కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు.ఇప్పటికే మూడు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించగా, తాజాగా మరో నాలుగు మృతదేహాల గుర్తింపు పూర్తయినట్లు తెలిపారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా, గడ్చిరోలి అటవీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టు కార్యకలాపాలపై ఈ ఎన్‌కౌంటర్ కీలక దెబ్బగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు

google-ad-img
    Related Sigment News
    • Loading...