Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జెన్ జెడ్ టార్గెట్ గా అతి పెద్ద డీప్ ఫేక్ వ్యూహం?
posted on: Jun 3, 2026 4:21PM
.webp)
రాబోయే రెండేళ్లలో పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. భారత రాజకీయ వాతావరణంలో కొత్త తరహా కథనాలు, ప్రచారాలపై చర్చ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా జెన్ జెడ్ యువతను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యూహం అమలు అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలు డీప్ స్టేట్ అనే భావనను ముందుకు తెచ్చి.. దేశ రాజకీయ దిశను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.
2027 ఫిబ్రవరి, మార్చి లో యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు జాతీయ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో, ప్రచార వ్యూహాలపై ప్రత్యేక దృష్టి పడింది.
జెన్ జెడ్ లక్ష్యంగా కథనాల నిర్మాణం అనే అంశానికి వస్తే.. యువ ఓటర్లలో క్రమంగా ఒక విధమైన అభిప్రాయాలను స్థిరపరచే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. అభివృద్ధి ఫలితాలు వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రతిఫలించడం లేదనే భావన బాగా ఉంది. అభివృద్ధి గణాంకాలు వాస్తవానికి భిన్నంగా చూపిస్తున్నారనే సందేహమూ ఉంది. కేంద్ర ప్రభుత్వ అసమర్థత, అవినీతి అనే చిత్రణ చేయడం, ఉద్యోగ అవకాశాల కొరత ఉందనడం, అసమానతల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి అంశాలే వీరి ప్రధానాస్త్రాలు.
ఇక ప్రచార పద్ధతులు ఎలాంటివంటే.. ఇన్ఫ్లుయెన్సర్లు, భాషా వ్యాప్తి ద్వారా.. ఈ కథనాలను మరింత విస్తరింప చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టాక్ షో హోస్ట్‌లు వంటి వ్యక్తులను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రచారం కేవలం ఆంగ్లంలో కాకుండా హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా జరుగుతోందని అంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లలో కొందరికి ఇందులోని అతి పెద్ద అజెండా తెలియకపోయినా, ఆర్థిక ప్రోత్సాహాలతో ప్రచారం కొనసాగుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులకు నేరుగా మద్దతు ఇవ్వకుండా, విశ్వాసాన్ని క్రమంగా దెబ్బతీసే విధానాన్ని అనుసరిస్తున్నారనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
గత దశాబ్దంలో ఓటు హక్కు పొందిన జెన్ జెడ్ తరానికి గత రాజకీయ పరిస్థితులపై అవగాహన తక్కువగా ఉందనే అభిప్రాయముంది. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన సమస్యలు, భద్రతా సవాళ్లు, అవినీతి వంటి అంశాలపై అవగాహన లోపం ఉందని విమర్శిస్తున్నారు కూడా. దేశంలో అభివృద్ధి జరిగినప్పటికీ, అది సాధారణ ప్రజల జీవితాల్లో ప్రతిబింబించలేదనే భావనను బలపరచడం ఇందులోని మరో ప్రాధాన్యతాంశంగా కనిపిస్తోంది.
ఇక పోతే ఎన్‌డీఏలో విభేదాల సృష్టి. కొన్ని ఆధారాల ప్రకారం, మీడియా చర్చల ద్వారా లేదా రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా ఎన్డీఏలో అంతర్గత విభేదాలను పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతిమ లక్ష్యం ఏమిటి? అని చూస్తే.. బీజేపీ విజయాన్ని ఎలాగైనా తగ్గించడం లేదా దెబ్బతీయడం. యువ ఓటర్లను ఓటింగ్ నుంచి దూరం చేయడం.. లేకుంటే వారిని నోటా వైపు మళ్లించడం.. వీరి మెయిన్ టార్గెట్ గా తెలుస్తోంది. మొత్తంగా దేశాన్ని బలహీనపరచి భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడంగా కనిపిస్తోంది.
దీంతో అప్రమత్తమైన కేంద్రం ఎజెండా ఆధారిత మీడియా ఛానెళ్ల పర్యవేక్షణ, వారికి వచ్చే నిధుల మూలాలపై లోతైన పరిధిలో దర్యాప్తు చేస్తోంది. సోషల్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రియాక్షన్ సిస్టమ్ ని మరింత బలోపేతం చేయడం, తప్పుడు ప్రచారాలపై ఫ్యాక్ట్ చెక్ చేయడం, రాజకీయ సలహాదారుల పాత్రపై సమీక్ష నిర్వహించడం వంటివి చేయాలని భావిస్తోంది.
వందల కోట్ల రూపాయలతో దేశాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిర్లక్ష్యం వహించడం అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. అయితే వీటన్నటి నిజానిజాలపై స్వతంత్ర ధృవీకరణ అవసరం అయి ఉండవచ్చు. అయినప్పటికీ, ఎన్నికల ముందు సోషల్ మీడియా ప్రభావం, యువత అభిప్రాయాల రూపకల్పన వంటి అంశాలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో కీలక చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






